News March 11, 2025
పార్వతీపురం: జిల్లా ప్రయాణికుల లోగో ఆవిష్కరణ

జిల్లా ప్రయాణికుల లోగోను జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా ప్రయాణికుల సంక్షేమ సంఘం ఈ లోగోను రూపొందించింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బడే నాగభూషణ రావు, తోటపల్లి టెంపుల్ ట్రస్ట్ ట్రెజరర్ శ్రీరామచంద్ర మూర్తి, డిఆర్‌యూసీసీ సభ్యులు శ్రీహరి, ఏఐ సాఫ్ట్ బ్రాండ్ ప్రతినిధి డా.మని భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 13, 2025
వేధింపుల వల్లే హసీనా మృతి: తండ్రి ఫిర్యాదు

పెద్దకడబూరు మండలం మేకడోనలో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హసీనా కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి మృతి చెందింది. హసీనాకు ముగ్గురు సంతానం. ఆమె మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. తమ కూతురి మరణానికి అల్లుడే కారణమని హసీనా తండ్రి మోహినుద్దీన్ సాబ్ పెద్దకడబూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాదాపు 3 ఏళ్లుగా తన కూతురుని వేధించేవాడని పేర్కొన్నారు.
News September 13, 2025
కృష్ణ: కర్ణాటక బస్సును ఢీకొని వ్యక్తి మృతి

కర్ణాటక బస్సును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన శుక్రవారం కృష్ణ మండలంలో కృష్ణ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. కృష్ణ ఎస్సై నవీద్ తెలిపిన వివరాల ప్రకారం.. శక్తినగర్ గ్రామానికి చెందిన సుగర్ రెడ్డి(40) టై రోడ్డు నుంచి శక్తినగర్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కర్ణాటక బస్‌ను ఢీకొన్నాడు. ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోయాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో చనిపోయాడు.
News September 13, 2025
JRG: వర్జీనియా పొగాకు ధర అధరహో

వర్జీనియా పొగాకు ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి. గత ఏడాది కిలో క్వాలిటీ పొగాకు గరిష్ఠ ధర రూ.411 ఆల్ టైమ్ రికార్డు కాగా ప్రస్తుతం రూ.418 పలికింది. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–32లో కిలో పొగాకు ధర రూ.418, వేలం కేంద్రం–18లో రూ.417, కొయ్యలగూడెంలో రూ.418, గోపాలపురంలో రూ.416, దేవరపల్లిలో రూ.416 ధర పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.