News March 11, 2025
పార్వతీపురం: జిల్లా ప్రయాణికుల లోగో ఆవిష్కరణ

జిల్లా ప్రయాణికుల లోగోను జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా ప్రయాణికుల సంక్షేమ సంఘం ఈ లోగోను రూపొందించింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బడే నాగభూషణ రావు, తోటపల్లి టెంపుల్ ట్రస్ట్ ట్రెజరర్ శ్రీరామచంద్ర మూర్తి, డిఆర్‌యూసీసీ సభ్యులు శ్రీహరి, ఏఐ సాఫ్ట్ బ్రాండ్ ప్రతినిధి డా.మని భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
MBNR: ‘సీఐటీయూ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి’

కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఐటీయూ తెలిపింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కురుమూర్తి శుక్రవారం మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రధాన సమస్యలైన జీతాల పెంపు, పీఎఫ్, ఈఎస్ఐ బోనస్, గ్రాటిటి, పెన్షన్, లేబర్ కోడ్ రద్దు, కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
News March 21, 2025
SHOCKING: మాంసం, హలీం తింటున్నారా?

TG: HYDలోని పలు హోటళ్లలో కుళ్లిన మాంసం ప్రజలను హడలెత్తిస్తోంది. ఇటీవల మంగళ్‌హట్‌లో అధికారులు 12 టన్నుల మేక మాంసాన్ని సీజ్ చేయగా, ఇవాళ డబీర్‌పురలో 2 టన్నుల మటన్‌ను గుర్తించారు. పాడైన మేక, గొర్రె మాంసాన్ని వివాహాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడు మిస్సాహుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో మటన్, హలీం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుళ్లిన మాంసం సరఫరాను అరికట్టాలని కోరుతున్నారు.
News March 21, 2025
MBNR: ప్రభుత్వ ఆస్తులను టచ్ చేస్తే కఠిన చర్యలు: DE

చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే చట్టపరమైన కఠినచర్యలు తప్పవని మైనర్ ఇరిగేషన్ DE మనోహర్ హెచ్చరించారు. ఏనుగొండలోని కొర్రంగడ్డ కుంటను కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని ఫిర్యాదులు అందడంతో శుక్రవారం అధికారులతో కలిసి కుంటను ఆయన పరిశీలించారు. ప్రభుత్వానికి చెందిన ఆస్తులను ఆక్రమణలకు గురిచేస్తే ఎంతటి వారైనా సహించబోమని మనోహర్ తెలిపారు.