News February 12, 2026
పార్వతీపురం: ‘జిల్లా వ్యవసాయ రూపురేఖలు మార్చేయడమే లక్ష్యం’

వ్యవసాయ రంగంలో రూపురేఖలు మార్చేయడమే డిస్ట్రిక్ట్ అగ్రి-రూరల్ ట్రాన్స్ ఫార్మేషన్ ప్లాన్ లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. DARTP మన జిల్లాలో ఇప్పుడే ప్రారంభమైందన్నారు. దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 24 జిల్లాలు అభ్యర్థనలు సమర్పించగా, ఏపీ నుంచి కేవలం 7 జిల్లాలు మాత్రమే ఎంపిక చేయబడ్డాయని, ఇందులో భాగంగా ఈ జిల్లా ఎంపికైందని గుర్తు చేశారు.
Similar News
News March 7, 2026
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

TPCC మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామకమయ్యారు. ఆమె నియామకాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆమె కాంగ్రెస్‌లో 45 ఏళ్లుగా ఉన్నారు. 1991లో PACS ఛైర్‌పర్సన్‌గా తొలిసారి ఎన్నికవగా 2005లో వరంగల్ నగర మేయర్‌గా పని చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి MLAగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023-2025 వరకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు.
News March 7, 2026
పోలవరం: జిల్లాలో ఎటుచూసినా పులి భయం

పోలవరం జిల్లా రంపచోడవరం అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో ప్రాంతంలో పులి జాడ కనిపించడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. శుక్రవారం ఫోక్స్ పేట అటవీప్రాంతంలో పులి ఉందని అధికారులు నిర్ధారించారు. అయితే చింతూరు డివిజన్‌లోని ఎటపాకలో కూడా మరో పులి తిరుగుతుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పులి సంచారం భయపెడుతోంది.