News February 12, 2026
పార్వతీపురం: ‘జిల్లా వ్యవసాయ రూపురేఖలు మార్చేయడమే లక్ష్యం’

వ్యవసాయ రంగంలో రూపురేఖలు మార్చేయడమే డిస్ట్రిక్ట్ అగ్రి-రూరల్ ట్రాన్స్ ఫార్మేషన్ ప్లాన్ లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. DARTP మన జిల్లాలో ఇప్పుడే ప్రారంభమైందన్నారు. దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 24 జిల్లాలు అభ్యర్థనలు సమర్పించగా, ఏపీ నుంచి కేవలం 7 జిల్లాలు మాత్రమే ఎంపిక చేయబడ్డాయని, ఇందులో భాగంగా ఈ జిల్లా ఎంపికైందని గుర్తు చేశారు.
Similar News
News March 9, 2026
HPV టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్వతీపురం కలెక్టర్

పార్వతిపురం కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో HPV టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. మహిళల ఆరోగ్య రక్షణే ప్రధాన ధ్యేయంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను నివారించే దిశగా ప్రభుత్వం టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. బహిరంగ మార్కెట్లో టీకా ధర రూ.4,000 పైగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు.
News March 9, 2026
మహిళలూ HYD వెళ్తున్నారా… అయితే త్వరలో మీకోసం ఓ యాప్

TG: విద్య, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి HYDకి వచ్చే మహిళల కోసం ఓ యాప్‌ను GOVT తెస్తోంది. వారికి వసతి, భద్రత కల్పించే లక్ష్యంతో దీన్ని రూపొందిస్తోంది. యాప్ ద్వారా GOVT, గుర్తింపు పొందిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలోని రూములను ముందుగా బుక్ చేసుకోవచ్చు. హాస్టళ్లలో CCTV కెమెరాలు, సెక్యూరిటీతో పటిష్ఠ ఏర్పాట్లుంటాయి. TNలో అమల్లో ఉన్న ఇలాంటి యాప్‌ను పరిశీలించిన అధికారులు త్వరలో ఇక్కడా ప్రారంభించనున్నారు.
News March 9, 2026
ICC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇదే

T20WC-2026 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఐసీసీ ప్రకటించింది. 11 మందిలో భారత్ నుంచి నలుగురికి చోటు దక్కింది. సౌతాఫ్రికా ప్లేయర్ మార్క్రమ్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది.
టీమ్: సంజూ శాంసన్, ఫర్హాన్ (పాక్), ఇషాన్ కిషన్, మార్క్రమ్ (C), హార్దిక్ పాండ్య, విల్ జాక్స్, జేసన్ హోల్డర్, బుమ్రా, ఎంగిడి, ఆదిల్ రషీద్, ముజరబానీ (జింబాబ్వే).
*12వ ఆటగాడిగా స్కాల్విక్ (USA)
> జట్టు ఎలా ఉందో COMMENT చేయండి.


