News February 12, 2026

పార్వతీపురం: ‘జిల్లా వ్యవసాయ రూపురేఖలు మార్చేయడమే లక్ష్యం’

image

వ్యవసాయ రంగంలో రూపురేఖలు మార్చేయడమే డిస్ట్రిక్ట్ అగ్రి-రూరల్ ట్రాన్స్ ఫార్మేషన్ ప్లాన్ లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. DARTP మన జిల్లాలో ఇప్పుడే ప్రారంభమైందన్నారు. దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 24 జిల్లాలు అభ్యర్థనలు సమర్పించగా, ఏపీ నుంచి కేవలం 7 జిల్లాలు మాత్రమే ఎంపిక చేయబడ్డాయని, ఇందులో భాగంగా ఈ జిల్లా ఎంపికైందని గుర్తు చేశారు.

Similar News

News March 14, 2026

భద్రాద్రి జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లాలో ప్రస్తుతం 26 గ్యాస్ పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అందులో HPCL14, BPCL5, IOCL7 గ్యాస్ పంపిణీ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. మొత్తం 4,69,075 గ్యాస్ కనెక్షన్లు ఉండగా వాటిలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 2,41,175, డబుల్ సిలిండర్ 98,868, దీపం 53,405, సీఎస్ఆర్ కనెక్షన్లు 2,465, ప్రధాన పీఎంయూవై కనెక్షన్లు 73,162 ఉన్నాయన్నారు. గ్యాస్ కొరత లేదని తెలిపారు

News March 14, 2026

ADB: వంటింట్లో యుద్ధ సెగలు

image

చమురు, గ్యాస్ ధరల సెగ వంటింటిపై పడుతోంది. వినియోగదారులు ముందస్తు బుకింగ్‌లు చేయడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. అధికారికంగా రూ.60 పెరిగి సిలిండర్ ధర రూ.920 కాగా, బ్లాక్ మార్కెట్లో రూ.1100 వరకు ఉంది. ADBలో 282.2, ASFలో 190.0, MNCLలో 345.2, నిర్మల్‌లో 269.3 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇదే అదునుగా వ్యాపారులు సిలిండర్‌పై రూ.150 నుంచి రూ.200 వరకు అదనంగా దండుకుంటున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

News March 14, 2026

9వ తరగతి నుంచే ‘పదో తరగతి’కి సన్నద్ధం: కలెక్టర్

image

వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కలెక్టర్ బాలాజీ వినూత్న కార్యాచరణ ప్రకటించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇప్పుడే 10వ తరగతి సిలబస్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. 2027 SSC పరీక్షల కోసం వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు.