News March 16, 2025

పార్వతీపురం జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యం కావాలి: కలెక్టర్

image

పార్వతీపురం జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యం కావాలని జిల్లా ప్రత్యేక అధికారి డా. నారాయణ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ప్రత్యేక అధికారి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా అభివృద్ధి సాధన లక్ష్యంగా అడుగులు వేస్తుందని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సైతం అభివృద్ది దిశగా అడుగులు వేయాలని చెప్పారు.

Similar News

News December 1, 2025

BREAKING ప్రకాశం: క్రిస్మస్ ఏర్పాట్లు..ఇద్దరు మృతి.!

image

త్రిపురాంతకంలో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కొత్త అన్నసముద్రంలో విద్యుత్ ఘాతానికి గురై ఎస్సీ కాలనీకి చెందిన ఇరువురు మృతి చెందారు. పచ్చిలగొర్ల విజయ్ (40) వీర్నపాటి దేవయ్య (35) సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగంగా స్టార్ ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 1, 2025

NZB: సర్పంచి టు మినిస్టర్

image

కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన ఏలేటి మహిపాల్ రెడ్డి 1981లో కోనాపూర్ సర్పంచిగా గెలిచారు. అనంతరం ఆయన భీమ్‌గల్ పంచాయతీ సమితి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. 1983 ఎన్నికల్లో TDP నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1985లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ హయంలో మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా పని చేశారు.

News December 1, 2025

6న చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.