News January 26, 2025
పార్వతీపురం జేసీకి ప్రశంసాపత్రం.. ఎందుకంటే?

పార్వతీపురం మన్యం జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభికకు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ప్రశంస పత్రాన్ని అందజేశారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్పి ఎస్.వి మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రశంస పత్రం అందుకున్నారు. రీసర్వే, ధాన్యం కొనుగోలులో పారదర్శకంగా సేవలు అందజేసినందుకు గాను ప్రశంసా పత్రం అందజేశారు.
Similar News
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.
News July 11, 2025
జగిత్యాల మెడికల్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. షర్మిల

జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల కొత్త ప్రిన్సిపాల్‌గా డాక్టర్ జి. షర్మిల గురువారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్‌లోని క్యాతం చందయ్య మెమోరియల్ మెటర్నిటీ ఆసుపత్రిలో గైనకాలజీ ప్రొఫెసర్‌గా, సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను పదోన్నతిపై జగిత్యాల మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం కళాశాలకు వచ్చిన ఆమెకు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
News July 11, 2025
చనిపోయినట్లు ప్రకటించిన 12 గంటలకు లేచిన శిశువు!

మహారాష్ట్రలో ఓ వింత సంఘటన జరిగింది. చనిపోయిందనుకున్న శిశువు 12 గంటల తర్వాత తిరిగి బతికింది. బీద్‌లోని రామానంద తీర్థ్ ఆస్పత్రిలో ఓ మహిళ 7వ నెలలోనే 900 గ్రాములున్న శిశువుకు జన్మనిచ్చింది. ఆ బేబీని రాత్రంతా ICUలో ఉంచి ఆ తర్వాత చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఖననం చేసే సమయంలో ముసుగు తీసి చూడగా కదలాడుతున్నట్లు కనిపించింది. వెంటనే వారు ఆ శిశువును మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.