News February 18, 2025

పార్వతీపురం టీచర్లు పట్టం కట్టేదెవరికో?

image

ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 27 పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న ఓట్లు లెక్కిస్తారు. జిల్లాలో మొత్తం 2,031 టీచర్ ఓటర్లు ఉన్నారు. గతంలో గాదె శ్రీనివాసులనాయుడు, రఘువర్మకు అవకాశం ఇచ్చిన టీచర్లు ఈ ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఈసారి కూడా వీరిద్దరితో పాటు పీడీఎఫ్ తరఫున విజయగౌరి బరిలో ఉన్నారు. వీరి ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ ఉండనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News November 21, 2025

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు

image

HYDలోని అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు GHMC నోటీసులు ఇచ్చింది. ఈ సంస్థలు తాము వినియోగిస్తున్న స్థలాన్ని తక్కువగా చూపుతూ ట్రేడ్ లైసెన్స్ పొందినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులిచ్చారు. అన్నపూర్ణ సంస్థ ₹11.52L చెల్లించాల్సి ఉండగా కేవలం ₹49K చెల్లిస్తోందని, రామానాయుడు సంస్థ ₹2.73Lకి గాను ₹7,614 కడుతున్నట్లు సమాచారం.

News November 21, 2025

మాజీ మంత్రి శైలజానాథ్‌కు మాతృవియోగం

image

శింగనమల వైసీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ తల్లి సాకే గంగమ్మ మృతి చెందారు. అనంతపురంలోని రామకృష్ణ నగర్‌లో నివాసం ఉంటున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో శైలజానాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు శైలజానాథ్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News November 21, 2025

నెల్లూరులో చేపల సాగుకు ప్రాధాన్యత

image

రొయ్యలకంటే చేపల సాగుకే నెల్లూరులో ప్రాధాన్యత పెరుగుతోంది. తక్కువ ఖర్చులు, స్థిరమైన చరల కారణంగా చేపల పెంపకం ఏటా విస్తరిస్తోంది. జిల్లాలో 5 వేల ఎకరాల్లో గెండి, బొచ్చ, మోసు, రూప్‌చంద్ చేపలు ప్రధానంగా సాగు అవుతున్నాయి. సంవత్సరానికి సగటుగా 1.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తోంది. ఇందులో గెండి 10%, బొచ్చ 35%, మోసు 3% ఉత్పత్తి. చేపలను తమిళనాడు, కర్ణాటక, కేరళ, ప.బెంగాల్‌కి ఎగుమతి చేస్తున్నారు.