News February 6, 2025

పార్వతీపురం: ‘డీ – వార్మింగ్‌డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన జరగనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమ బ్యానర్‌ను కలెక్టర్, వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న డీ-వార్మింగ్ డే, 17న మాప్ అప్‌డే కార్యక్రమాలు జరగనున్నాయని అన్నారు.

Similar News

News December 9, 2025

విద్యార్థుల గళంపై కూటమి ఉక్కుపాదం మోపుతుంది: YCP

image

విద్యార్థుల గళంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని YCP ‘X’లో పోస్ట్ చేసింది. YCP స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపినందుకు చైతన్యపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారని రాసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే కేసులా చంద్రబాబు, లోకేశ్ అంటూ ప్రశ్నించారు.

News December 9, 2025

జగిత్యాలలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. ఈరోజు కనిష్ఠంగా కథలాపూర్, మన్నెగూడెంలో 9.1℃, రాఘవపేట 9.3, ఐలాపూర్ 9.4, గుల్లకోట 9.5, మల్లాపూర్ 9.5, మేడిపల్లి, పేగడపల్లి, నేరెళ్ల 9.6, గోవిందారం 9.7, రాయికల్, జగ్గాసాగర్ 9.8, పూడూర్, బుద్దేశ్‌పల్లి 9.9, అల్లీపూర్లో 10.0℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలన్నింటికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగతా ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది.

News December 9, 2025

ప్రియురాలి వీడియో వైరల్.. హార్దిక్ పాండ్య ఆగ్రహం

image

బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లపై టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రెస్టారెంట్ మెట్లు దిగి వస్తుండగా తన ప్రియురాలు మహికా శర్మను అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీయగా అవి వైరలయ్యాయి. దీంతో చీప్ సెన్సేషనలిజమ్ కోసం ఇలా దిగజారడం సరికాదని ఇన్‌స్టాలో పాండ్య ఫైరయ్యారు. మహిళలను గౌరవించాలని హితవు పలికారు. ఇకపై ఫొటోలు తీసేటప్పుడు మైండ్‌ఫుల్‌గా ప్రవర్తించాలన్నారు.