News February 6, 2025
పార్వతీపురం: ‘డీ – వార్మింగ్‌డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’

జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన జరగనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమ బ్యానర్‌ను కలెక్టర్, వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న డీ-వార్మింగ్ డే, 17న మాప్ అప్‌డే కార్యక్రమాలు జరగనున్నాయని అన్నారు.
Similar News
News March 23, 2025
డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్‌లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
News March 23, 2025
వర్ష బాధిత రైతులకు రేపు జగన్ పరామర్శ

AP: మాజీ సీఎం జగన్ రేపు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లింగాల మండలంలో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు చేతికొచ్చిన అరటి తోటలు నేలకొరిగాయి. ఈ క్రమంలో ఆయన వాటిని పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. ఇప్పటికే పులివెందుల చేరుకున్న జగన్ ఈ రాత్రికి జిల్లాలోని జడ్పీటీసీలతో సమావేశం అవుతారు. ఈ నెల 27న జడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
News March 23, 2025
హిందూపురంలో 8మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

హిందూపురం పరిధిలోని కొట్టిపి, కేంచినపల్లి సమీపంలోని హంద్రీనీవా పరిసర ప్రాంతాలలో శనివారం రాత్రి పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపు దాడి చేసినట్లు తెలిపారు. ఇందులో 8 మందిని అరెస్టు చేసి వారివద్ద నుంచి రూ.30 వేలు నగదు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హిందూపురం పరిధిలో జూదం ఆడినా.. నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.