News March 22, 2024

పార్వతీపురం: తండ్రి మృతి.. బరువెక్కిన గుండెతో పరీక్ష

image

గుండెపోటుకు గురై మృతి చెందిన తండ్రి మృతదేహం ఇంట్లో ఉండగానే కన్నీళ్లు దిగమింగుకుంటూ బరువెక్కిన గుండెతో ఒక విద్యార్థి పదవ తరగతి పరీక్షకు హాజరైన విషాద సంఘటన శుక్రవారం పార్వతీపురం మండలంలో జరిగింది. నర్సిపురం గ్రామానికి చెందిన వినయ్ అనే విద్యార్థి తండ్రి ఎన్. సీతారాం(45) శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఇంటి వద్దే మృతి చెందాడు. కుమారుడు వినయ్ పదవ తరగతి పరీక్ష రాసిన తర్వాత అంత్యక్రియలకు హాజరయ్యాడు.

Similar News

News November 21, 2025

వైష్ణవ క్షేత్రాలకు విజయనగరం నుంచి ప్రత్యేక సర్వీసులు

image

మార్గశిర, ధనుర్మాసం పుణ్యదినాలు పురస్కరించుకుని ప్రయాణికులు సౌకర్యార్థం విజయనగరం ఆర్టీసీ వారు ప్రముఖ వైష్ణవ క్షేత్రాలైన ద్వారకాతిరుమల, వాడపల్లి, అంతర్వేది, అప్పన్నపల్లి, అన్నవరం దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలకు డిపోలో సంప్రదించాలని కోరారు.

News November 21, 2025

కొత్తవలస MRO అప్పలరాజు సస్పెండ్

image

కొత్తవలస MRO పి.అప్పలరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తవలస మండలంలోని చిన్నపాలెం, కింతలపాలెం, కొత్తవలస గ్రామాల్లో భూములకు సంబందించి మ్యుటేషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ PGRS ద్వారా కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ డిప్యూటీ తహశీల్దార్‌గా ఉన్న సునీతకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.

News November 21, 2025

ఏపీ సచివాలయంలో మంత్రి కొండపల్లి సమీక్ష

image

రాష్ట్రంలో MSME రంగ అభివృద్ధి, క్షేత్ర స్థాయి అధికారుల పనితీరుపై అమరావతి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభం బన్సల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. MSMEలకు అందిస్తున్న ప్రోత్సాహం, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చేపడుతున్న చర్యలపై చర్చించినట్లు మంత్రి తెలిపారు.