News November 2, 2024

పార్వతీపురం: తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య

image

తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. తూడి గ్రామానికి చెందిన కొనిశ శివ(27) తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిందని రైల్వే HC దేశాబత్తుల రత్నకుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News December 1, 2025

విజయనగరం: ‘లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి’

image

డిసెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించాలని జిల్లా జడ్జి ఎం.బబిత న్యాయమూర్తులకు సూచించారు. సోమవారం జిల్లా కోర్టు పరిధిలో ఉన్న న్యాయమూర్తులతో ఆమె సమావేశం నిర్వహించారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద భీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కు బౌన్స్, మనీ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు వంటి వాటిని ఇరు పార్టీల అనుమతితో శాశ్వత పరిష్కారం చేయాలని తెలిపారు.

News December 1, 2025

విజయనగరం: HIV వ్యాధిగ్ర‌స్తుల‌తో కలిసి భోజ‌నం చేసిన కలెక్టర్

image

జిల్లాలో కొత్తగా హెచ్ఐవీ కేసులు నమోదు కాకుండా త‌గిన‌ జాగ్రత్తలు తీసుకోవాల‌ని కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమ‌వారం జిల్లా కేంద్రంలో ర్యాలీతో పాటు స్థానిక ఐఎంఏ హాలులో అవ‌గాహ‌నా సదస్సు నిర్వహించారు. అనంతరం బాధితుల‌తో కలిసి కలెక్టర్ స‌హ‌పంక్తి భోజ‌నాలు చేశారు. హెచ్.ఐ.వి. వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని, వారు కూడా సమాజంలో భాగమేనన్నారు.

News November 30, 2025

VZM: ‘గురజాడ నివాసాన్ని జాతీయ స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలి’

image

గురజాడ అప్పారావు నివాసాన్ని జాతీయ స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రముఖ కవి తెలకపల్లి రవి, సామాజిక వేత్త దేవి డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరంలో గురజాడ వర్ధంతి సందర్భంగా జరిగిన గౌరవ యాత్రలో వారు పాల్గొన్నారు. గురజాడ ప్రపంచానికి తెలుగు భాష ఔనిత్యాన్ని చాటి చెప్పిన మహా కవి అన్నారు. గురజాడ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.