News February 28, 2025

పార్వతీపురం: తాను చనిపోయినా..!

image

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల కేంద్రం గొల్ల వీధికి చెందిన కొల్లి రవణ బ్రెయిన్ స్ట్రోక్‌తో గురువారం సాయంత్రం మృతిచెందారు. అంతటి విషాదంలోనూ ఆయన కుటుంబ సభ్యులు మంచి మనసు చాటుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ఓ ఐ బ్యాంకుకు రెండు కళ్లను దానం చేశారు. రవణ తాను చనిపోయి మరొకరికి చూపు ప్రసాదించారని పలువురు కొనియాడారు.

Similar News

News December 10, 2025

సంగారెడ్డి: రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీల నేతలను కలుస్తున్నాం

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఢిల్లీలో అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పటేల్ పాల్గొన్నారు.

News December 10, 2025

నెల్లూరు కలెక్టర్‌కు 2వ ర్యాంకు

image

నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన 682 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 628 క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను 17 గంటల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. దీంతో ఫైల్ క్లియరెన్స్‌లో మన కలెక్టర్‌కు సీఎం రాష్ట్రంలోనే 2వ ర్యాంకు ఇచ్చారు.

News December 10, 2025

HYDలో ​నైట్ లైఫ్‌కు కేఫ్ కల్చర్ కిక్

image

HYD టెక్ స్టూడెంట్స్, క్రియేటర్స్ ‘కేఫ్ కల్చర్’ని కొత్త అడ్డాగా మార్చుకున్నారు. పగలు లాప్‌టాప్‌లతో కో-వర్కింగ్ సెంటర్లుగా, నైట్ బోర్డ్ గేమ్స్, ఓపెన్ మైక్స్, ఇండీ మ్యూజిక్ గిగ్స్‌తో సందడి చేస్తున్నారు. PUBలకు భిన్నంగా ఈ హాట్‌స్పాట్‌లు ఉంటాయి. వైన్-డైన్‌కు బదులు కాఫీ, ఫుడ్‌తో యూత్‌ని ఆకర్షిస్తున్నాయి. మద్యం లేకుండా క్రియేటివిటీ, కమ్యూనిటీతో మజా డబుల్ అవుతోంది. దీన్నే స్టడీ పార్టీ అని పిలుస్తున్నారు.