News April 7, 2024
పార్వతీపురం: ‘నియమావళి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి’

సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా నిర్వహించుటకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీ చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. శనివారం జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. గంజాయి, మద్యం, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు.
Similar News
News November 15, 2025
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దారులు: మంత్రి కొండపల్లి

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు విజన్తో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆరంభించిన ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి భారీ స్పందన రావడం రాష్ట్ర ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్తో పాటు వివిధ రంగాల వారీగా నిపుణులు సమ్మిట్లో పాల్గొన్నారన్నారు.
News November 14, 2025
హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు: ఎస్పీ

ఎల్.కోట మండలం రేగలో 2021లో భూతగాదాల వివాదంతో హత్య జరిగింది. ఈ కేసులో ముగ్గురి నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.3వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తీర్పు ఇచ్చారని SP దామోదర్ తెలిపారు. ఈశ్వరరావు అనే వ్యక్తిని కర్రలతో దాడి చేసి చంపినట్టు నేరం రుజువైనందున విశ్వనాథం, దేముడమ్మ, లక్ష్మిలకు శిక్ష విధించారని వెల్లడించారు. ఏ1గా ఉన్న నిందితుడు అప్పారావు విచారణలో మృతి చెందాడన్నారు.
News November 14, 2025
VZM: ‘మధుమేహంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు’

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన సదస్సులు, స్క్రీనింగ్ పరీక్షలను శుక్రవారం నిర్వహించినట్లు DMHO జీవనరాణి తెలిపారు. మొత్తం 44 కార్యాలయాల సిబ్బందికి టెస్టులు చేయడంతో పాటు, అన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మధుమేహంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. మధుమేహంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.


