News March 13, 2025

పార్వతీపురం: నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు

image

పార్వతీపురం మన్యంలో గురువారం ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. వడగాల్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

Similar News

News November 15, 2025

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం జడ్పీ స్కూల్‌ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి రోజు విద్యార్థి పాఠశాలకు వచ్చేలా చూడాలని, పాఠశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు ఫోన్ చేసి పిలిపించాలని తెలిపారు. పది విద్యార్థులకు బోధించే టీచర్లకు అత్యవసరమైతే తప్ప సెలవులు ఇవ్వొద్దని HMకు సూచించారు.

News November 15, 2025

పాఠశాలల అభివృద్ధి పనులు పర్యవేక్షించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్రతి అధికారికి రెండు పాఠశాలలు కేటాయించి, పనుల పురోగతిని పరిశీలించాలన్నారు. వినియోగంలో లేని ప్రభుత్వ బ్యాంక్ ఖాతాల వివరాలను నవంబర్ 22లోపు పూర్తిచేయాలని సూచించారు. విద్యా సంస్థల మౌలిక వసతుల కోసం రూ. 30 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News November 15, 2025

MBNR: ఆ పదవి కోసం.. ఆశావాహులు ఎదురుచూపులు!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎనిమిది నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ పదవి కోసం సీనియర్ నాయకులు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు ఎన్నిక జరగకపోవడంతో ఆశావాహులు నిరాశ చెందారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎప్పుడు ఈ పదవులను భర్తీ చేస్తుందోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.