News April 11, 2025
పార్వతీపురం : నేడు పిడుగులతో కూడిన వర్షాలు

పార్వతీపురం జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణంలో మార్పులు రైతులను కలవర పెడుతున్నాయి.
Similar News
News September 13, 2025
ఫేక్ ప్రచారాలకు త్వరలోనే చెక్: మంత్రి అనిత

AP: సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల నియంత్రణకు త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. దీనిపై సీఎం CBN కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తోందని చెప్పారు. కొందరు విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారని, ఎక్కడ దాక్కున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టం రాబోతోందని చెప్పారు. SMలో మహిళలపై వ్యక్తిత్వ హననం ఎక్కువవుతోందని వాపోయారు.
News September 13, 2025
సంగారెడ్డి: డిగ్రీలో స్పాట్ అడ్మిషన్లు

దోస్త్ ద్వారా సంగారెడ్డిలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు ఈనెల 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అరుణబాయి శుక్రవారం తెలిపారు. ఇంటర్ మెమో, బోనఫైడ్, టీసీ, ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలని చెప్పారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.
News September 13, 2025
పల్నాడులో విష జ్వరాల విజృంభణ.. ఐదేళ్ల చిన్నారి మృతి

వాతావరణంలో మార్పుల కారణంగా పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. ముందుగా జలుబు, దగ్గుతో ప్రారంభమై క్రమంగా జ్వరంగా మారుతుందని, చాలా మంది గొంతు నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. క్రోసూరు మండలం ఆవులవారిపాలెంలో ఐదేళ్ల చిన్నారి నాగలక్ష్మీ విష జ్వరంతో మృతి చెందడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై వైద్య అధికారులు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.