News April 12, 2025
పార్వతీపురం: నేడే ఇంటర్ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఫస్టియర్ 8,968 మంది, సెకండియర్ 8,881 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకప్పుడు రిజల్ట్స్ కోసం నెట్ సెంటర్ల చుట్టూ తిరిగేవారు. నేడు సెల్‌ఫోన్‌లోనే చూసుకుంటున్నారు. రిజల్ట్స్ వెతికేందుకు టెన్షన్ పడొద్దు.. వే2న్యూస్ యాప్‌లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
Similar News
News February 10, 2026
సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఫిబ్రవరి 11న ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి మున్సిపల్ పరిధుల్లో పని చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేలా యజమానులు సహకరించాలని కోరారు.
News February 10, 2026
సామర్లకోటలో స్టార్ కమెడియన్

సామర్లకోటలో సోమవారం సినీ బృందం సందడి చేసింది. హాస్య నటుడు అలీ, జీవిత, ఆమె కుమార్తె పాల్గొనగా నూతన చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ప్రధానంగా అలీపై కొన్ని హాస్య సన్నివేశాలను షూట్ చేశారు. ఈ చిత్రీకరణ మూడు రోజుల పాటు జరుగుతుందని, మరికొంతమంది ప్రముఖులు ఇందులో పాల్గొంటారని చిత్ర నిర్మాణ వర్గాలు తెలిపాయి. తారలను చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
News February 10, 2026
యుద్ధ భయం.. 37 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన ఖమేనీ

USతో యుద్ధ భయం నేపథ్యంలో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ 37 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్ వేశారు. ఈ నెల 8న ఎయిర్‌ఫోర్స్ కమాండర్లతో భేటీకి ఆయన హాజరుకాలేదని ఇరాన్ ఇంటర్నేషనల్ తెలిపింది. 1989లో సుప్రీంలీడర్ అయినప్పటి నుంచి ఈ మీటింగ్‌ను ఆయన మిస్ కాలేదు. 1979 Feb 8న ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా రుహొల్లా ఖొమేనీ(మాజీ సుప్రీంలీడర్)కి వాయుసేన అధికారులు విధేయత చూపడానికి గుర్తుగా కమాండర్లతో ఖమేనీ భేటీ అవుతుంటారు.


