News January 28, 2025
పార్వతీపురం: ‘పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి’

జిల్లాలో మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని DRO కె.హేమలత సంబంధిత అధికారులను అదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై డీఆర్ఓ అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఇంటర్మీడియట్ విద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాలల్లో పరీక్షలు నిర్వహిస్తమన్నారు.
Similar News
News February 23, 2026
బాఫ్టాలో భారతీయ సినిమా ‘బూంగ్’ చరిత్ర.. బెస్ట్ చిల్డ్రన్ ఫిలింగా అవార్డు!

BAFTA-2026 అవార్డుల్లో మణిపురీ చిత్రం ‘Boong’ సత్తా చాటింది. ‘బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిలిం’ కేటగిరీలో అవార్డు గెలుచుకొంది. ఈ విభాగంలో బాఫ్టా అవార్డు అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ‘జూటోపియా 2’ వంటి సినిమాలను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించడం విశేషం. లక్ష్మీప్రియా దేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మించారు.
News February 23, 2026
జీవన విధానం ఎలా ఉండాలో చెప్పే శ్లోకం

ఆపదర్థం ధనం రక్షేత్ దారాన్ రక్షే ద్ధనై రపి|
ఆత్మానం సతతం రక్షేత్ దారై రపి ధనై రపి||
భవిష్యత్తులో వచ్చే కష్టాల కోసం ధనాన్ని దాచుకోవాలి. అవసరమైతే ఆ ధనాన్ని ఖర్చు చేసైనా కుటుంబాన్ని రక్షించుకోవాలి. కానీ, ప్రాణ సంకట సమయంలో ధనం, కుటుంబం కంటే తన్ను తాను కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. తాను జీవించి ఉంటేనే కదా మళ్లీ సంపదను, సంసారాన్ని చూసుకోగలడు!
News February 23, 2026
ఎర్రవల్లి: బస్సు కింద పడి గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి

ఎర్రవల్లి మండలం బొచ్చు వెంగనపల్లెకు చెందిన అంజలి అనే చిన్నారి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందింది. హైదరాబాద్లో చదువుతున్న అంజలి, తల్లితో కలిసి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.


