News March 30, 2025

పార్వతీపురం: పచ్చని చెట్టు కొమ్మలే బిడ్డకు గొడుగుగా..

image

తన వేలే ఊతగా నడక నేర్చిన బిడ్డ ఎండకు అల్లాడుతుంటే ఏ తల్లి అయినా తట్టుకోగలదా? అందుకే కుమారుడికి ఎండ సెగ తగలకుండా చెట్టు కొమ్మలనే గొడుగుగా మార్చింది. అమ్మ ప్రేమకు అద్దం పట్టే ఈ దృశ్యం కురుపాం మండలం తెన్నుఖర్జ రహదారిలో కనిపించింది. ఓ గిరిజన మహిళ తన మూడేళ్ల బిడ్డకు ఎండ నుంచి రక్షణ కోసం పచ్చని చెట్టు కొమ్మను అడ్డుగా ఉంచగా.. ఆ పిల్లాడు తల్లి ప్రేమ నీడలో ముందుకు నడిచిన దృశ్యం చూపరులను ఆకర్షించింది.

Similar News

News November 24, 2025

నిరంజన్ నీ తాటతీస్తా.. ఒళ్లు జాగ్రత్త: కవిత

image

TG: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై జాగృతి చీఫ్ కవిత ఫైరయ్యారు. ఆయన అవినీతి వల్లే వనపర్తిలో BRSకు కోలుకోలేని దెబ్బపడిందని దుయ్యబట్టారు. 3, 4 ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారని విమర్శించారు. MRO ఆఫీసును తగలబెడితే ఎదురుతిరిగిన 32 మందిని జైలుకు పంపారన్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఓడించడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. ‘నాగురించి ఇంకోసారి మాట్లాడితే నీ తాటతీస్తా. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో’ అని హెచ్చరించారు.

News November 24, 2025

తణుకులో సందడి చేసిన OG హీరోయిన్

image

సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సోమవారం తణుకులో సందడి చేశారు. స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామకృష్ణావధానులు ఉన్నారు.

News November 24, 2025

జనగామ: రేపు కలెక్టరేట్‌లో దిశా కమిటీ సమావేశం

image

జనగామ కలెక్టరేట్లో మంగళవారం దిశా కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిని వసంత తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కావున ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, దిశా కమిటీ మెంబర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.