News March 29, 2025
పార్వతీపురం: పదవ తరగతి విద్యార్థులకు అలెర్ట్

ఈనెల 31వ తేదిన జరగబోయే పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించడం జరుగుతుందని DEO ఎన్. తిరుపతి నాయుడు శనివారం తెలిపారు. ప్రభుత్వం ఈనెల 31న రంజాన్ సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు మార్పు చేసినట్టు తెలిపారు. కావున పరీక్షా సిబ్బంది అందరూ గమనించి, అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేయాలని సూచించారు.
Similar News
News November 24, 2025
ఇళ్లు లేనివారు ఈనెల 30లోగా ఇలా చేయండి: కర్నూలు కలెక్టర్

PMAY–2 గ్రామీణ్ కింద అర్హతకలిగి, ఇల్లులేని గ్రామీణ ప్రజలు నవంబర్ 30లోపు తమపేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామాల్లో ఇంటి స్థలం ఉన్నా– లేకపోయినా సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేయవచ్చని తెలిపారు. ఇల్లు మంజూరు అయ్యేవారికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందజేస్తుందని పేర్కొన్నారు. గడువు తర్వాత నమోదు అవకాశంలేదని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News November 24, 2025
పీజీఆర్ఎస్ అర్జీలకు ప్రాధాన్యం: ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ బిందుమాధవ్ అధికారులకు సూచించారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 42 మంది ఫిర్యాదుదారుల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి, వాటిని సకాలంలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆదేశించారు.
News November 24, 2025
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో ఇల్లు రీసర్వే, తల్లికి వందనం, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన త్రాగునీరు తదితరు అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ నాగరాణి సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. త్రాగునీరు సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


