News February 28, 2025

పార్వతీపురం: పశు వైద్య భవనాలకు మరమ్మతులు

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని పాడైన పశు వైద్య భవనాలకు మరమ్మతులు, అవసరమైన నూతన భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపామని జిల్లా పశు సంవర్ధక అధికారి డా.ఎస్.మన్మధరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 7 పశు వైద్య శాలలు, 38 పశు వైద్య శస్త్ర చికిత్సాలయాలు, 35 గ్రామీణ పశు వైద్య కేంద్రాల ద్వారా పశు వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News November 17, 2025

సంగారెడ్డిలో అద్భుత దృశ్యం ఆవిష్కరణ

image

సంగారెడ్డి పట్టణం మహబూబ్ సాగర్ చెరువు కట్ట హనుమాన్ మంత్రం సమీపంలో సోమవారం తెల్లవారుజామున అద్భుత దృశ్యం ఆవిష్కర్తమైంది. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో పసుపు పచ్చని కాంతులతో పంట పొలాలు మారాయి. ఈ అద్భుత ఘట్టాన్ని కొందరూ తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. సూర్యుడిని చూసేందుకు ప్రజలు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు.

News November 17, 2025

పుల్కల్: అత్తారింటి వేధింపులకు వివాహిత ఆత్మహత్య

image

అత్తింటి వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పుల్కల్ మం.లో జరిగింది. స్థానికుల వివరాలు.. పెద్దారెడ్డిపేట వాసి పట్నం ప్రవీణ్‌కు వట్పల్లి మం. బిజిలిపూర్‌కు చెందిన లక్ష్మి(26)తో 20 నెలల క్రితం వివాహమైంది. అత్తమామలు, భర్త అదనపు కట్నం తేవాలని వేధించారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టి సర్ది చెప్పినా మార్పు రాలేదు. దీంతో లక్ష్మి శనివారం ఇంట్లో ఉరి వేసుకుంది. మృతురాలికి 10 నెలల పాప ఉంది.

News November 17, 2025

నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

image

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్‌ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.