News April 16, 2025
పార్వతీపురం: ‘పాఠశాలల్లో అడ్మిషన్ డ్రైవ్ ప్రారంభించాలి’

పాఠశాలల్లో అడ్మిషన్ డ్రైవ్ ప్రారంభించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో అడ్మిషన్‌లు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల విద్యా ఆరోగ్య స్థాయిలను గూర్చి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటున్న చిన్నారులందరూ ఒకటవ తరగతిలో విధిగా చేర్చాలని ఆయన ఆదేశించారు.
Similar News
News April 22, 2025
BREAKING: మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

హీరో మహేశ్ బాబుకు ED నోటీసులు పంపింది. రియల్ ఎస్టేట్ సంస్థలు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు హాజరుకావాలంది. ఈ కంపెనీలు ఒకే భూమిని వివిధ వ్యక్తులకు అమ్మి మోసం చేసినట్లు ఇటీవల ED సోదాల్లో తేలింది. ఈ సంస్థలకు ప్రమోషన్ చేసినందుకు మహేశ్ బాబు రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు గుర్తించింది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్‌ఫ్లుయెన్స్ చేశారని ఆయనపై అభియోగం మోపింది.
News April 22, 2025
డ్రైవర్ డోర్ డెలివరీ కేసు పునర్విచారణ

AP: కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో పునర్విచారణకు కాకినాడ SP బిందు మాధవ్ ఆదేశించారు. విచారణ అధికారిగా IPS అధికారిని నియమించారు. 60 రోజుల్లో విచారణ నివేదిక అందజేయాలన్నారు. 2022 మే 19న YCP MLC అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం సంచలనమైంది. అప్పటి ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చిందనే ఆరోపణలు వచ్చాయి.
News April 22, 2025
సిరిసిల్ల : నేడు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

జిల్లాలో మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయనుంది. జిల్లాలో మొత్తం 9,310 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 5,065 మంది ఫస్టియర్, 4.245 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం నేడు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST