News February 24, 2025
పార్వతీపురం: ‘పీ-4 సర్వేని పక్కాగా చేపట్టాలి’

జిల్లాలో పీ-4 విధానంపై (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్ షిప్) సర్వేను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. మార్చి 8 నుంచి 28వ తేదీ వరకు సర్వే చేయాలని సూచించారు. జిల్లాలో 2,65,000 గృహాలు ఉన్నాయని, వ్యవధి తక్కువగా ఉన్నందున ప్రణాళికబద్దంగా సర్వే పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
Similar News
News November 28, 2025
సూర్యాపేట: నవంబర్ 29న దివ్యాంగులకు క్రీడా పోటీలు

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లాలో ఈ నెల 29న జిల్లా స్థాయి ఆటల పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు. రన్నింగ్, షాట్ ఫుట్, చెస్ క్రీడలు ఉంటాయని పేర్కొన్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో క్రీడలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News November 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 28, 2025
నేడు అమరావతిలో కేంద్ర మంత్రి పర్యటన.. షెడ్యూల్ ఇదే.!

అమరావతిలో పలు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఆమె షెడ్యూల్ విడుదల చేశారు. 9:30 నిమిషాలకు విజయవాడ నోవాటెల్ నుంచి బయలుదేరి 10 గంటలకు అమరావతి CRDA కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొని 12:50కు బయలుదేరి 1:45కు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తారు.


