News April 4, 2025
పార్వతీపురం: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

భార్య మందలించిందని ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పార్వతీపురం జిల్లా గరుగుబిల్లి మండలంలో జరిగింది. వల్లరిగుడబ గ్రామానికి చెందిన పలగర్ర పోలి (40)ని మందు తాగొద్దని భార్య మందలించడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. వెంటనే ఆటోలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు పార్వతీపురం అవుట్ పోస్ట్ ASI భాస్కరరావు తెలిపారు.
Similar News
News October 14, 2025
విశాఖలో మొట్టమొదటి గూగుల్ AI హబ్: సుందర్

డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటన చేశారు. ‘విశాఖపట్నంలో తొలి ఏఐ హబ్‌కు సంబంధించిన ప్రణాళికపై ప్రధాని మోదీతో మాట్లాడా. ఈ ఏఐ హబ్ కీలక మైలురాయి కానుంది. ఈ కేంద్రంలో గిగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఇంటర్నేషనల్ సబ్‌సీ గేట్‌వే & భారీ స్థాయి ఇంధన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. దీనిద్వారా AI ఆవిష్కరణలు వేగవంతం చేస్తాం.’ అని Xలో పేర్కొన్నారు.
News October 14, 2025
TU: అదుపు తప్పిన ఉపకులపతి కారు

టీయూ ఉపకులపతి ఆచార్య యాదగిరి రావు ప్రభుత్వ వాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉదయం ఉపకులపతి పరిపాలనా భవనం వద్దకు చేరుకొని, తన సొంత పనుల నిమిత్తం వాహనంలో ఆయన భార్యను నిజామాబాద్‌కి పంపించారు. తిరిగి వస్తుండగా కంఠేశ్వర్ బైపాస్ వద్ద అదుపు తప్పి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. గమనించిన స్థానికులు వాహనాన్ని రోడ్డుకు చేర్చారు.
News October 14, 2025
HYD: ‘ప్రపంచ స్కిల్ కాంపిటేషన్.. రేపే లాస్ట్’

ప్రపంచ స్కిల్ కాంపిటేషన్ (World Skill Competition)లో పాల్గొని, అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి యువత ఈనెల 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారిణి మైత్రి ప్రియ Way2Newsతో తెలిపారు. వయస్సు 16-24 ఏళ్లలోపు ఉండి నైపుణ్యం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆసక్తి గలవారు http://www.skillindiadigital.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.