News April 4, 2025
పార్వతీపురం: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

భార్య మందలించిందని ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పార్వతీపురం జిల్లా గరుగుబిల్లి మండలంలో జరిగింది. వల్లరిగుడబ గ్రామానికి చెందిన పలగర్ర పోలి (40)ని మందు తాగొద్దని భార్య మందలించడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. వెంటనే ఆటోలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు పార్వతీపురం అవుట్ పోస్ట్ ASI భాస్కరరావు తెలిపారు.
Similar News
News July 8, 2025
WGL: మహిళలకు గుడ్ న్యూస్.. రూ.18కోట్లు మంజూరు

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల్లో రుణాలు తీసుకున్న సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రుణాలకు సంబంధించిన వడ్డీని మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి సెర్ప్ పరిధిలో రూ.18 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మహిళా శక్తి సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను మహిళల ఖాతాల్లో జమ చేయనుంది. వడ్డీ నిధులను మంజూరు చేయడం పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
News July 8, 2025
శ్రీరాముడు మా దేశంలోనే జన్మించాడు: నేపాల్ ప్రధాని

నేపాల్ PM కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగా శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించారని అన్నారు. శివుడు, విశ్వామిత్రుడు తమ ప్రాంతానికే చెందినవారన్నారు. ఈ విషయాన్ని చెప్పేందుకు దేశ ప్రజలు సంకోచించవద్దని పిలుపునిచ్చారు. అటు భారతదేశం ‘నకిలీ అయోధ్య’ని ప్రచారం చేస్తోందని కూడా ఆయన విమర్శించారు. కాగా మన పురాణాల ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించారని ప్రసిద్ధి.
News July 8, 2025
ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి: కలెక్టర్

గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ శ్యాం ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి జాగ్రత్తగా సంరక్షించాలని కోరారు. పచ్చని మొక్కలను దత్తత తీసుకొని పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.