News March 4, 2025

పార్వతీపురం: ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 562 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 562 గైర్హాజరు అయినట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా మంగళవారం 34 పరీక్ష కేంద్రాల్లో 9,437 మంది విద్యార్థులకు గాను 8,875 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో 6,488 మంది జనరల్ విద్యార్థులకు 6,243 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,949మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 2,632 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

శుభ సమయం (16-09-2025) మంగళవారం

image

✒ తిథి: బహుళ దశమి రా.2.51 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర ఉ.10.33 వరకు
✒ శుభ సమయములు: సా.5.10-సా.6.10
✒ రాహుకాలం: మ.3.00-మ.4.30
✒ యమగండం: ఉ.9.30-మ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: రా.10.08-రా.11.38
✒ అమృత ఘడియలు: ఏమీ లేవు

News September 16, 2025

స్వస్త్ నారీ, సశక్త్ పరివార్‌ను సక్సెస్ చేయాలి: కలెక్టర్ తేజస్

image

‘స్వస్త్ నారి, సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతాయని పేర్కొన్నారు.

News September 16, 2025

మెదక్: రేవంత్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్: హరీశ్‌రావు

image

కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్‌ అయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఆపేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని ఆయన విమర్శించారు. డ్రామాలు కట్టిపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.