News March 4, 2025
పార్వతీపురం: ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 562 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 562 గైర్హాజరు అయినట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా మంగళవారం 34 పరీక్ష కేంద్రాల్లో 9,437 మంది విద్యార్థులకు గాను 8,875 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో 6,488 మంది జనరల్ విద్యార్థులకు 6,243 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,949మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 2,632 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
Similar News
News January 25, 2026
NLG: నేటి నుంచి చెర్వుగట్టు జాతర

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రథసప్తమితో ప్రారంభం కానున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్ ఉదయం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్ బాబు తెలిపారు.
News January 25, 2026
ఆదివారం రోజున మాంసాహారం తింటున్నారా?

ఆదివారమొస్తే చాలామంది మాంసాహారం తింటుంటారు. కానీ శాస్త్రాలు అది తప్పని చెబుతున్నాయి. ఎందుకంటే ఇది సూర్యుడికి అంకితమైన రోజు. ఆయన ఆరోగ్యానికి, సాత్విక శక్తికి కారకుడు. ‘స్త్రీ తైల మధు మాంసాని రవివారే విసర్జయేత్’ అనే శ్లోకం ప్రకారం ఈరోజు మాంసం తినకూడదు. ఇది మన శరీరంలో తామస గుణాన్ని పెంచుతుంది. సూర్యుని సాత్విక శక్తిని గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఆత్మశుద్ధి, దీర్ఘాయువు కోసం ఈ నియమాలు పాటించాలి.
News January 25, 2026
NRPT: సంక్షేమ పథకాలపై ‘విలేజ్ విజిట్’ సర్వే: కలెక్టర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాలను ఆల్ ఇండియా సర్వీసెస్ మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ విలేజ్ విజిట్ ప్రోగ్రాం ద్వారా సోషల్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ స్కీం సర్వే నిర్వహిస్తారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో సర్వే చేస్తారని అన్నారు.


