News March 22, 2025
పార్వతీపురం: ‘ఫారంపండ్స్ నిర్మాణాలపై దృష్టి సారించాలి’

జిల్లాలో ఫారంపండ్స్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మండల అధికారులను ఆదేశించారు. పల్లె పండుగ కార్యక్రమంపై రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్లు, డ్వామా పీడీలతో శుక్రవారం సమీక్షించారు.
Similar News
News December 2, 2025
ఉస్మానియా పార్కులో రాజాపూర్ విద్యార్థి ఆత్మహత్య

శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రెడ్డి విజ్ఞాన్ తేజ (19) ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనింగ్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న విజ్ఞాన్ తేజ, సోమవారం రాత్రి ఉస్మానియా ఆక్సిజన్ పార్కులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరినట్లు గ్రామస్థులు తెలిపారు.
News December 2, 2025
రేపు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పార్లమెంట్ భవనంలోనే పీఎంతో సమావేశమై తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులను సైతం రేవంత్ కలిసి సదస్సుకు ఇన్వైట్ చేయనున్నారు.
News December 2, 2025
NGKL:జర్నలిస్టుల మహాధర్నాను విజయవంతం చేయాలి

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ DEC 3న HYD I&PR కమిషనర్ కార్యాలయం వద్ద TUWJ(IJU) ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని టెమా పాలమూరు జిల్లా కన్వీనర్ అహ్మద్ పాష పిలుపునిచ్చారు. అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. అక్రిడిటేషన్ పాలసీ ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించాలని అన్నారు


