News January 24, 2025
పార్వతీపురం: ఫైలేరియా నియంత్రణ కార్యక్రమం విజయవంతం కావాలి

వచ్చే నెల 10 నుంచి 12వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న ఫైలేరియా నియంత్రణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. గత ఏడాది నవంబర్ మాసంలో నిర్వహించిన సర్వేలో బలిజిపేట మండలంలో ఫైలేరియా కేసులు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని అన్నారు.
Similar News
News February 16, 2025
బోనకల్: గుండెపోటుతో నిద్రలోనే యువకుడు కన్నుమూత

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన బోనకల్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. కలకోటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తోకచిచ్చు నిహార్ రాత్రి అన్నం తిని పడుకున్నాడు. ఉదయం లేచేసరికి వాంతి చేసుకున్నట్లు ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నిహార్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంటికి పెద్ద కుమారుడు కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
News February 16, 2025
ఏప్రిల్‌లో మత్స్యకారులకు రూ.20,000: మంత్రి

AP: ఏటా JANలో జాబ్ క్యాలెండర్, మెగా DSC అంటూ జగన్ నిరుద్యోగులను మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. MLC ఎన్నికలు ముగియగానే తమ ప్రభుత్వం 16,247 పోస్టులతో DSC విడుదల చేస్తుందని పునరుద్ఘాటించారు. జూన్‌కు ముందే నియామకాలు పూర్తి చేస్తామని, ‘తల్లికి వందనం’ అందిస్తామని చెప్పారు. సముద్రంలో చేపల వేట నిషేధిత రోజులకు గాను మత్స్యకారులకు APRలో ₹20K, MAYలో ‘అన్నదాత సుఖీభవ’ అమలు చేస్తామన్నారు.
News February 16, 2025
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు హీరో ప్రభాస్‌కు ఆహ్వానం

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్‌ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వానించారు. ఆదివారం ప్రభాస్‌ను కలిసిన ఎమ్మెల్యే.. ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా ఇప్పటికే ప్రభాస్ మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను ఆధారంగా తీస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.