News February 11, 2025
పార్వతీపురం: ‘బంద్‌కు సహకరించండి’

1/70 చట్టాన్ని సవరించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 12వ తేదీన జరగనున్న ఏజెన్సీ బంద్‌కు సహకరించాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం డిపో మేనేజర్ కనకదుర్గకు వినతిపత్రం అందజేశారు. గిరిజన సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా చట్ట సవరణ చేయాలని చూస్తున్నారు ఆరోపించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 17, 2025
మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

భార్యాభర్తల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. పరోక్ష వ్యాఖ్యానాలు చేయొద్దు. నేరుగానే పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.
News November 17, 2025
కాంగ్రెస్ ప్లాన్ B: తప్పించకముందే.. తప్పించుకుంటే!

BRS నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఫిరాయింపు వేటు పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పథకం రచిస్తోంది. అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు చేయాలనే విషయం సీఎం నిర్ణయిస్తారని సమాచారం. కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం పోటీచేయడంతో ఆయన అధికారికంగా పార్టీ మారినట్లే లెక్కని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
News November 17, 2025
అనకాపల్లి: ‘ఐటీఐతో జర్మనీలో ఉద్యోగాలు’

జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన ఎలమంచిలి సూర్య ఐటీఐ కళాశాలలో ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా అధికారి గోవిందరావు తెలిపారు. ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి రెండేళ్లు అనుభవం ఉన్న అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. పాస్ పోర్ట్, విద్యార్హత ధ్రువపత్రాలతో జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. ముందు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు.


