News February 26, 2026
పార్వతీపురం: ‘బాల కార్మికులు పనికి కాదు.. బడికి వెళ్లాలి’

జిల్లాలోని బాల కార్మికులు పనికి కాదని.. బడికి వెళ్లాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో కార్మికుల నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో బాల కార్మికుల నిర్ములన ఒక ఉద్యమంలా చేపట్టాలని బాల కార్మిక నిర్ములన శాఖ అధికారి ఎసిఎల్ సువర్ణను ఆదేశించారు. బాలల హక్కులను కాపాడటం ప్రతీ పౌరుడి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News April 20, 2026
రహానే చెత్త రికార్డు

నిన్న RRతో మ్యాచులో సున్నాకే ఔటైన KKR కెప్టెన్ రహానే IPLలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఓపెనర్‌గా అత్యధిక సార్లు(12) డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పార్థివ్ పటేల్(11), శిఖర్(10), గంభీర్(10), వార్నర్(9) ఉన్నారు. ఓవరాల్(బ్యాటింగ్ పొజిషన్‌తో సంబంధం లేకుండా)గా మ్యాక్స్‌వెల్(19) టాప్‌లో ఉన్నారు. కాగా సీజన్‌లో రహానే 7 మ్యాచుల్లో 25.33 యావరేజ్‌తో 152 రన్స్ చేశారు.
News April 20, 2026
భర్త మృతిపై పోలీసుల ప్రమేయం లేదు: లక్ష్మి

దొంగతనం బయటపడటం, పాత కేసుల అవమాన భారంతోనే తన <<19694132>>భర్త<<>> వెంకటసుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య లక్ష్మి వెల్లడించారు. ఆదివారం రాత్రి అవుకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోస్టుమార్టం అనంతరం కుమారుడు సుమంత్‌తో కలిసి ఆమె ఈ వివరాలు తెలిపారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని పేర్కొన్నారు.
News April 20, 2026
నిజామాబాద్: భయ్యా ఎందుకంత స్పీడు..?

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రహదారి ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు జిల్లావ్యాప్తంగా ప్రమాదాలకు నిలయంగా మారిన 55 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. 2024 లో 857 ప్రమాదాలు జరగగా, 353 మంది ప్రాణాలు కోల్పోయారు. 2025లో తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రమాదాలు 780కి, మరణాలు 276కి తగ్గాయి. అతివేగం, అజాగ్రత్త వల్ల వందలాది మంది క్షతగాత్రులుగా మారుతున్నారు.


