News April 7, 2025

పార్వతీపురం: ‘బిసి యూనిట్ల ఏర్పాటు వేగవంతం చేయాలి’

image

జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేయుటకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని ఆమేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో ఇంటర్వ్యూలు పూర్తి చేశారని ఆయన చెప్పారు.

Similar News

News November 18, 2025

గంభీరావుపేట: PG స్పాట్ అడ్మిషన్స్‌కు నేడే ఆఖరు

image

గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో నేడు పీజీ స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. M.COM, M.SC కంప్యూటర్ సైన్స్‌లో అడ్మిషన్స్‌కు అవకాశం ఉందని, ఆసక్తిగల విద్యార్థిని, విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో కళాశాలలో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేశారు.

NLG: మిల్లు బయటే వారం రోజులుగా ధాన్యం లారీ

image

నల్గొండ(M) శేషమ్మగూడెం PACS ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తిప్పర్తి(M) అనిశెట్టి దుప్పలపల్లిలోని మిల్లు బయటే వారం రోజులుగా నిలిచిపోయింది. ధాన్యం లోడును మిల్లుకు తరలించగా, బాగా లేదనే కారణంతో మిల్లు యాజమాన్యం తిరస్కరించింది. 7 రోజులుగా ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు వాపోయారు. వర్షం వస్తే ధాన్యం పరిస్థితి ఏంటని దిగులు చెందుతున్నారు.