News March 26, 2025

పార్వతీపురం: బీసీ కులస్థులకు 90 శాతం సబ్సిడీతో పరికరాలు

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుల వృత్తిదారులకు అవసరమయ్యే అత్యాధునిక పరికరాలను 90% సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు బీసీల కోసం బడ్జెట్ కేటాయించిన విషయం తెలిసిందే. అయితే లబ్ధిదారులు నేరుగా వృత్తి పరికరాలను ఎంపిక చేసుకునే అవకాశం వినియోగించుకోవాలని బీసీ కార్పొరేషన్ ఈడీ ఆర్. గడ్డెమ్మ పార్వతీపురంలో జరిగిన సంక్షేమ సమీక్ష సమావేశంలో తెలిపారు. దరఖాస్తులను తమకు ఇవ్వాలని కోరారు.

Similar News

News January 3, 2026

ఎస్ఐఆర్ గడువులోగా పూర్తి చేస్తాం: కలెక్టర్

image

ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా గద్వాల కలెక్టర్ సంతోష్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 49 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు.

News January 3, 2026

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్పీ స్నేహ మెహ్రా

image

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ స్నేహ మెహ్రా అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా శనివారం కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. రూల్స్ అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

News January 3, 2026

తప్పుల్లేని ఓటర్ల జాబితాను రూపొందించాలి: కలెక్టర్

image

ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. బీఎల్ఓలు ప్రతిరోజూ 30 నుంచి 40 ఎంట్రీలు చేస్తూ, ఇంటింటి సర్వే ద్వారా తప్పుల్లేని జాబితా సిద్ధం చేయాలన్నారు.