News November 2, 2024
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం
పార్వతీపురంలోని రైలు పట్టాలపై రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. జీఆర్పీ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో ఒకరు మృతి చెందగా, కూత వేటు దూరంలో మరొకరు మృతి చెందారు. ఒకే ప్రాంతంలో ఇద్దరు మృతి చెందడంపై పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 2, 2024
పార్వతీపురం: నేటి నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్
ఉచిత డీఎస్సీ కోచింగ్‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురంలో ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు గిరిజన సామాజిక భవనంలో సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కోచింగ్ రెండు నెలల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
News December 2, 2024
VZM: లీగల్ వాలంటీర్లుగా అవకాశం
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో పారా లీగల్ వాలంటీర్లుగా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి TV రాజేశ్ కోరారు. పదోతరగతి చదివి తెలుగు చదవడం, రాయడం రావాలన్నారు. క్రిమినల్ కేసులు ఉండరాదని సూచించారు. శిక్షణ కాలంలో గాని, శిక్షణ పూర్తైన తరువాత గాని ఎటువంటి జీతభత్యాలు ఉండవన్నారు. కేవలం సమాజ సేవ దృక్పథం గల వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
News December 1, 2024
మైనింగ్ కంపెనీపై చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎంకు లేఖ
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో నిర్వహిస్తున్న అత్యం మైనింగ్ ప్రైవేట్ కంపెనీపై చర్యలు చేపట్టాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ కోరారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. మండలంలోని 10 గ్రామాలలోని కొండలను మైనింగ్ కంపెనీ ఆక్రమిస్తుందని అన్నారు. దీనిపై ప్రశ్నించిన ఆయా గ్రామ ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో మైనింగ్ కంపెనీపై చర్యలు చేపట్టాలని కోరారు.