News January 27, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 3 రిజర్వ్ కేటగిరి మద్యం షాపులు

పార్వతీపురం మన్యం జిల్లాలో 3 రిజర్వ్ కేటగిరి మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఈఎస్ శ్రీనాధుడు ప్రకటలో తెలిపారు. సాలూరు రూరల్, పార్వతీపురం టౌన్, వీరఘట్టంలో ఏ-4 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. అప్లికేషన్ ఫీజు రూ. 2 లక్షలు, లైసెన్స్ ఫీజు రూ. 21.66 లక్షలు ఉందన్నారు. షాపులు లాటరీ విధానంలో కేటాయిస్తున్నట్లు తెలిపారు. వచ్చేనెల 5లోగా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News December 7, 2025
WNP: 102 పైలెట్ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానం

వనపర్తి జిల్లాలో EMRI సంస్థలో 102 అంబులెన్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని 108 జిల్లా కోఆర్డినేటర్ మహమూద్ తెలిపారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణత అయి ఉండి LMV(badge) లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. 23 నుంచి 35 వయసు మధ్య ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 8వ తేదీన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.
News December 7, 2025
ఫాజుల్ నగర్ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన ఇన్‌ఛార్జి కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను ఇన్‌ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదివారం పరిశీలించారు. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టి (SST) చెక్ పోస్ట్‌ను ఆమె తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ వివరాలు, రిజిస్టర్లను పరిశీలించి, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News December 7, 2025
జాక్ పాట్ కొట్టిన సిక్కోలు కుర్రాడు.. రూ.92 లక్షలతో ఉద్యోగం

శ్రీకాకుళం పట్టణం బలగ సమీపంలోని శిరిడిసాయి నగర్‌కు చెందిన విద్యార్థి మెండ హిమవంశి రూ.92 లక్షల వార్షిక వేతనంలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ అబ్బాయి ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతున్నాడు. ఢిల్లీకి చెందిన గ్రావిటన్ రీసెర్చ్ క్యాపిటల్ ఎల్.ఎల్.బి సంస్థ ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్‌కు ఎంపికయ్యాడు. పేరెంట్స్, టీచర్లు, కాలనీవాసులు కుర్రాడిని అభినందించారు.


