News January 27, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 3 రిజర్వ్ కేటగిరి మద్యం షాపులు

పార్వతీపురం మన్యం జిల్లాలో 3 రిజర్వ్ కేటగిరి మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఈఎస్ శ్రీనాధుడు ప్రకటలో తెలిపారు. సాలూరు రూరల్, పార్వతీపురం టౌన్, వీరఘట్టంలో ఏ-4 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. అప్లికేషన్ ఫీజు రూ. 2 లక్షలు, లైసెన్స్ ఫీజు రూ. 21.66 లక్షలు ఉందన్నారు. షాపులు లాటరీ విధానంలో కేటాయిస్తున్నట్లు తెలిపారు. వచ్చేనెల 5లోగా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News February 15, 2025
TG SETను మళ్లీ నిర్వహించాలి: BRS

గత ఏడాది SEPలో నిర్వహించిన TG SETలో పెద్ద తప్పిదం జరిగిందని BRS ఆరోపించింది. 100 ప్రశ్నల హిస్టరీ పేపర్‌లో 39 ప్రశ్నలు తప్పు ఇచ్చి కాంగ్రెస్ సర్కారు రికార్డు సృష్టించిందని ట్వీట్ చేసింది. ‘రెండు పేపర్లలో 40 ప్రశ్నలు తప్పుగా ఇచ్చి రేవంత్ తెలంగాణ పరువు తీశారు. 40 ప్రశ్నలకు 50 మార్కులు ఏ లెక్కన కలిపారు? రేవంత్ రాజీనామా చేయాలి. దీనిపై UGC విచారణ జరిపి పరీక్షను మళ్లీ నిర్వహించాలి’ అని డిమాండ్ చేసింది.
News February 15, 2025
మీర్పేట్: అధ్యక్షురాలికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ

మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉంటున్న తెలంగాణ జాగృతి నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు మిర్యాల పావనిని ఇవాళ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.
News February 15, 2025
చికెన్‌లో ఈ భాగాలు తింటున్నారా?

కోడిలో దాదాపు అన్ని భాగాలనూ మనం తింటాం. కానీ దాని మెడ, తోక, ఊపిరితిత్తుల్ని తినకుండా ఉండటమే శ్రేయస్కరమంటున్నారు ఆహార నిపుణులు. ఆ భాగాల్లో ఉండే హానికరమైన క్రిములు మనుషుల్లో ఆరోగ్య సమస్యలు కారణమయ్యే ఛాన్స్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా చర్మంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ ఉంటాయని, స్కిన్ లెస్ తినడమే బెటర్ అని సూచిస్తున్నారు.