News January 28, 2025
పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్పీ గా ఎల్. నాగేశ్వరి

పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్పీగా ఎల్ నాగేశ్వరిని నియమిస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఓ దిలీప్ కిరణ్ను ఏసీబీకి బదిలీ చేస్తూ ఈనెల 7న ఉత్తర్వులు జారీ చేశారు. మన్యం జిల్లా ఏర్పడిన నాటినుంచి అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్ జిల్లాలో విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు.
Similar News
News November 1, 2025
MNCL: ‘సదరం శిబిరాన్ని పారదర్శకంగా నిర్వహించాలి’

దివ్యాంగుల నూతన ధ్రువపత్రాలు, పునరుద్ధరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శనివారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న సదరం శిబిరాన్ని సందర్శించారు. ఈ నెల 1, 3, 4, 6, 7, 10, 11, 12, 13, 14 తేదీల్లో లోకో మోటార్/ఆర్దో 17, 18 తేదీల్లో వినికిడి లోపం సంబంధించి ప్రతి రోజు 75 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు.
News November 1, 2025
నస్పూర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు.
News November 1, 2025
ధర్మవరం హాస్టల్ ఇన్ఛార్జ్గా అలంపూర్ వార్డెన్

ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన కారణంగా వార్డెన్ జయరాములును విధుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో, ఆ హాస్టల్కు అలంపూర్ బీసీ హాస్టల్ వార్డెన్ డి.శేఖర్ను పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్ఛార్జ్గా నియమిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ శనివారం ప్రకటించారు. జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు హాస్టళ్లపై పర్యవేక్షణ చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.


