News February 5, 2025
పార్వతీపురం మన్యం జిల్లాకు సోనూసూద్ అంబులెన్స్‌లు

రాష్ట్ర ప్రభుత్వానికి సినీ నటుడు సోనూసూద్ నాలుగు అంబులెన్స్‌లను ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో రెండు అంబులెన్సులు పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం అవి చేరుకున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున ఆ అంబులెన్స్‌లను ఏవిధంగా ఉపయోగిస్తారో తెలియాల్సి ఉంది.
Similar News
News October 14, 2025
అలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు!

ఎవరికైనా ఫ్రెండ్స్ అంటే చాలామందే ఉంటారు. కానీ, బెస్ట్ ఫ్రెండ్ అనగానే ఒక్కరిద్దరు మాత్రమే ఉంటారు. మీరు నవ్వితే వాళ్లు నవ్వుతారు, మీరు ఏడిస్తే ఓదారుస్తారు, మీరు గెలిస్తే వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు, మీకు కష్టమొస్తే వాళ్లు అడ్డంగా నిలబడిపోతారు. ఎవరి లైఫ్‌లోనైనా అలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు. మీ జీవితంలో గెలిచారని చెప్పొచ్చు. మరి అలాంటి ట్రూ ఫ్రెండ్ మీ లైఫ్‌లోనూ ఉన్నారా? కామెంట్ చేయండి.
News October 14, 2025
విజయవాడలో అండర్-19 బాడ్మింటన్ జట్ల ఎంపిక

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 16న విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలోని బాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలన్నారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు.
News October 14, 2025
బత్తాయి, నిమ్మ: OCTలో చేపట్టాల్సిన చర్యలివే..

అక్టోబర్‌లో బత్తాయి, నిమ్మ తోటల్లో కాయలు ఉన్న చెట్లకు తేలికపాటి తడి ఇవ్వాలి. శిలీంధ్ర వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు కాండంపై బోర్డో పేస్టును పూసుకోవాలి. పిందె, కాయలు రాలడాన్ని నివారించడానికి 100గ్రా. కార్బండిజమ్, 1KG యూరియాను 100L నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. నల్లి నివారణకు నీటిలో కరిగే గంధకాన్ని లీటరు నీటికి 3గ్రా. చొప్పున కలిపి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.