News February 9, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో రిజర్వ్డ్ మద్యం షాపులకు 60 దరఖాస్తులు
పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు కేటాయించిన రిజర్వుడ్ మద్యం షాపులకు 60 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగిసిందని పేర్కొన్నారు. ఈ నెల 10 తేదీ ఉదయం 9 గంటలకు పార్వతీపురం కలెక్టరేట్లో లాటరీ ద్వారా షాపులు కేటాయించనున్నట్లు వివరించారు.
Similar News
News February 9, 2025
విశాఖ-ముంబై LTT రైలు రద్దు: డీసీఎం
విశాఖ నుంచి ముంబై వెళ్లే LTT రైలును(18519/20) ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. కాజీపేట్ డివిజన్లో ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడం వలన రైలును రద్దు చేసినట్లు వెల్లడించారు. ముంబై నుంచి విశాఖ వచ్చే రైలు కూడా ఫిబ్రవరి 12 నుంచి 22వరకు రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 9, 2025
HYD: బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు!
నార్సింగి PS పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను మధుసూదన్, జయంత్, సాయి, తరుణ్ అత్యాచారం చేసి ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆమె రూ.10వేలు వారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడీగా ఉంటున్న బాలికను తల్లి నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిని శుక్రవారం రిమాండ్ చేశారు.
News February 9, 2025
కరీబియన్ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
హోండురస్కు ఉత్తర దిక్కున కరీబియన్ సముద్రంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. సముద్రానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని జర్మన్ రిసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ సంస్థ తెలిపింది. ఈ ప్రాంతంలో 2021 తర్వాత ఇదే అతి పెద్ద భూకంప తీవ్రత కావడంతో కరీబియన్ సముద్రం చుట్టపక్కల ఉన్న హోండురస్, ప్యూర్టోరికో, వర్జిన్ ఐలాండ్స్కు అమెరికా సముద్ర, పర్యావరణ పరిశీలన సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.