News February 9, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 60 దరఖాస్తులు

పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు కేటాయించిన రిజర్వుడ్ మద్యం షాపులకు 60 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగిసిందని పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు పార్వతీపురం కలెక్టరేట్లో లాటరీ ద్వారా షాపులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
Similar News
News November 10, 2025
అకోలా-కాచిగూడ రైలులో ఒకరి హత్య

అకోల నుంచి కాచిగూడ వెళ్లే రైలులో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి సోమవారం తెలిపారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. ఉమ్మడి గ్రామానికి చెందిన అతిశ రైలులో వాటర్ బాటిల్ అమ్ముకుంటూండగా, అదే గ్రామానికి చెందిన షేక్ జమీర్ వాటర్ బాటిల్ విషయంలో గొడవ పడ్డారు. దీంతో జమీర్ గాజు సీసాతో అతిశపై దాడి చేయగా మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కరికెల్లి, ధర్మాబాద్ మధ్యలో జరిగింది.
News November 10, 2025
హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలా?

దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గాలి పీల్చలేక వేల మంది అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేయాలని మరోసారి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అక్కడ శుభ్రమైన గాలితో పాటు కనెక్టివిటీ బాగుంటుందని వివిధ రాష్ట్రాల నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని పలు కేంద్ర కార్యాలయాలను హైదరాబాద్కు తరలించాలంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 10, 2025
ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో దీపోత్సవం

ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో కార్తీక సోమవారం పురస్కరించుకొని సాయంకాల ప్రదోషకాల వేళలో దీపాలంకరణ సేవ నిర్వహించారు. అర్చకులు పార్థీవ శర్మ ఆధ్వర్యంలో పూజల అనంతరం మంటపంలో అమ్మవారి ఆకారంలో దీపాలు వెలిగించారు. అనంతరం మంజీరాలో గంగాహారతి ఇచ్చారు. ఆకాశ దీపం వెలిగించారు. భక్తులు పాల్గొని అమ్మవారి నామస్మరణ మారుమ్రోగించారు.


