News February 9, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో 60 దరఖాస్తులు

image

పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు కేటాయించిన రిజర్వుడ్ మద్యం షాపులకు 60 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగిసిందని పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు పార్వతీపురం కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా షాపులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

Similar News

News March 26, 2025

త్వరలోనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ: మంత్రి దుర్గేశ్

image

AP: గత ఏడాది జులైలో తూ.గోదావరి(D)లోని ఎర్రకాలువ ముంపుతో నష్టపోయిన రైతులకు మంత్రి కందుల దుర్గేశ్ శుభవార్త చెప్పారు. త్వరలోనే వారి అకౌంట్లలో ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేస్తామని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఈ అంశం చర్చకు రాగా వెంటనే నిధులు విడుదల చేయాలని CM చంద్రబాబు ఆదేశించారని పేర్కొన్నారు. కాగా భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరి జిల్లాల్లోని 20 నియోజకవర్గాల్లో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

News March 26, 2025

ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం షార్ట్ లిస్ట్ అభ్యర్థుల జాబితా విడుదల

image

ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల జాబితాను https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్‌లో ఉంచినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి కె. సరస్వతి తెలిపారు. షార్ట్ లిస్టు చేయబడిన అభ్యర్థులు ఈనెల 28వ తేదీ లేదా అంతకుముందు వెబ్ ఆప్షన్ సర్వీస్ ద్వారా ఎంప్యానల్ కోచింగ్ సంస్థలకు తమ ప్రాధాన్యతలను నమోదు చేసుకోవాలని కోరారు. ఫెజ్‌-1 ఎంపికలకు ఎడిట్ ఆప్షన్ లేదన్నారు.

News March 26, 2025

ఉగాది వేడుకలకు రూ.5 కోట్లు విడుదల

image

AP: ఉగాది వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు రిలీజ్ చేసింది. పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పురస్కారాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చింది. దీని కోసం ఒక్కో జిల్లాకు రూ.10 లక్షల చొప్పున కేటాయించింది.

error: Content is protected !!