News March 11, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ మండలాల వారు జాగ్రత్త

image

పార్వతీపురం మన్యంలో నేడు ఈ మండలాల్లో వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అధికారిక X ఖాతా ద్వారా సోమవారం హెచ్చరికలు జారీ చేసింది. వడగాలుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
*బలిజిపేట-40.1
*భామిని-39.2
*గరుగుబిల్లి-39.8
*గుమ్మలక్ష్మీపురం-38.6
*జియ్యమ్మవలస-39.7
ఈ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

Similar News

News December 9, 2025

సూర్యాపేటలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

image

సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, మెప్మా మహిళలు, ఆశా వర్కర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం అందరూ సమూహంగా “జయ జయహే తెలంగాణ” గీతాన్ని ఆలపించారు.

News December 9, 2025

బాపట్లలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

బాపట్లలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని చీలు రోడ్డు వద్ద లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న శివరామకృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News December 9, 2025

మెటాకు షాక్.. 4 ఏళ్లలో $70 బిలియన్లు హాంఫట్

image

VR హెడ్ సెట్స్, స్మార్ట్ గ్లాసెస్‌తో గేమింగ్ కమ్యూనిటీకి చేరువకావాలనుకున్న మెటా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. నాలుగేళ్లలో 70 బిలియన్ డాలర్లు నష్టపోయింది. 2026 ఆర్థిక సంవత్సరంలో రియాల్టీ ల్యాబ్స్ బడ్జెట్‌లో 30% కోత విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగా జనవరిలో లేఆఫ్స్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్ వాల్యూ పెరిగే వరకు MR గ్లాసెస్ లాంచ్‌‌ను పోస్ట్‌పోన్ చేయనున్నట్లు తెలుస్తోంది.