News March 24, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.
Similar News
News October 8, 2025
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు

TG: బీసీ రిజర్వేషన్ల పెంపు GOపై విచారణ జరుపుతున్న హైకోర్టు.. బిల్లు పాస్ అయిందా అని ప్రశ్నించింది. అసెంబ్లీలో పాస్ అయిందని, గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉందని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా.. రిజర్వేషన్లు 50 శాతం మించితే ఎన్నికలు రద్దు అవుతాయనే నిబంధన ఉందని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదించారు. వన్‌మెన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు.
News October 8, 2025
ఏయూ స్నాతకోత్సవం వాయిదా

ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వాయిదా పడిందని రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ప్రకటన జారీ చేశారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం 91, 92 సంయుక్త స్నాతకోత్సవం జరగాల్సి ఉంది. ఈ స్నాతకోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని రిజిస్ట్రార్ తెలిపారు.
News October 8, 2025
రూమర్స్‌పై స్పందించిన రష్మిక

కన్నడ ఇండస్ట్రీ తనను బ్యాన్ చేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ రష్మిక ఖండించారు. తనను ఏ ఇండస్ట్రీ నిషేధించలేదన్నారు. ‘‘తెరవెనుక జరిగేది ప్రపంచానికి తెలియదు. ‘కాంతార’ టీమ్‌ను విష్ చేశా. నేను ప్రతిదీ ఆన్లైన్లో పెట్టే వ్యక్తిని కాదు. వ్యక్తిగత జీవితం గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను. నా నటన గురించి ఏం మాట్లాడతారనేది ముఖ్యం’’ అని ‘థామా’ ప్రమోషన్లలో చెప్పారు.