News April 4, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు..

పార్వతీపురం జిల్లాలో శుక్రవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDM తెలిపింది. ఉదయం 10 తర్వాత బయటికొచ్చే వారంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సాలూరులో 37.1°C, మక్కువ 39.1, పాచిపెంట 36.8, కురుపాం 40.8, గరుగుబిల్లి 41.3, గుమ్మలక్ష్మీపురం 41.2, కొమరాడ 40.7, జియ్యమ్మవలస 41.2, పార్వతీపురం 40.3, సీతానగరం 40.6, బలిజిపేట 40.3, పాలకొండ 39.4, వీరఘట్టం 40.3, సీతంపేట 39, భామిలో 39.7గా నమోదౌతాయని తెలిపింది.
Similar News
News April 5, 2025
వికారాబాద్: 19 ప్రభుత్వ పాఠశాలల్లో AI తరగతులు

వికారాబాద్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి జిల్లాలోని 19 ప్రభుత్వ పాఠశాలల్లో AI తరగతులను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు చదవడం, రాయడం సులభంగా నేర్చుకునేందుకు AI తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
News April 5, 2025
అమలాపురం: మాజీ ఎంపీ హర్ష కుమార్‌పై కేసు నమోదు

అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్‌పై రాజానగరం పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. ఎస్సై నాగార్జున మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై హర్షకుమార్ ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించారన్నారు. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించాలని కోరగా నేటికీ స్పందించలేదన్నారు. దీంతో ఆయనపై 196, 197 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్నారు.
News April 5, 2025
గ్రూప్ -2 కు ఎంపికైన చౌడేపల్లి కానిస్టేబుల్

గ్రూప్-2 పరీక్షలలో చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆదినారాయణ ఎంపికయ్యారు. విధి నిర్వహణలో చురుగ్గా పాల్గొంటూ.. అటు గ్రూప్-2లో ప్రతిభ చూపాడు. ఆయనను సీఐ రాంభూపాల్, ఎస్సై నాగేశ్వరరావుతో పాటు సహచర సిబ్బంది అభినందించారు.