News June 14, 2024
పార్వతీపురం మన్యం జిల్లాకే వరుసగా మూడోసారి

వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక 2019లో కొత్తగా ప్రవేశ పెట్టిన గిరిజన సంక్షేమశాఖ వరుసగా మూడోసారి మన్యం జిల్లాకి వరించింది. YCP హయాంలో కురుపాం MLA పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఈ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణికి శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. దీంతో జిల్లాలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 29, 2025
రేషన్ సరకుల పంపిణీ శతశాతం పూర్తి కావాలి: VZM కలెక్టర్

రేషన్ పంపిణీ బుధవారం లోగా శతశాతం పూర్తి కావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో మంగళవారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. నవంబరు నెల రేషన్ సరకుల పంపిణీని ముందుగానే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటికే జిల్లాలో పంపిణీ మొదలయ్యిందని చెప్పారు. బుధవారం నాటికి అన్ని గ్రామాల్లో శతశాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
News October 29, 2025
విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు: జడ్పీ ఛైర్మన్

గుర్ల కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. సమాచారం తెలుసుకున్న జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నెల్లిమర్ల ప్రభుత్వాసుపత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఐదుగురు విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని చిన్న శ్రీను విజ్ఞప్తి చేశారు.
News October 28, 2025
VZM: ‘24 గంటలు విధుల్లో ఉండాలి’

మొంథా తుఫానును దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన 71 పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులను కల్పించాలని జిల్లా తుఫాను ప్రత్యేకాధికారి రవి సుభాష్ పట్టంశెట్టి ఆదేశించారు. కాల్ సెంటర్లతో పాటు సచివాలయాలు, పునరావాస కేంద్రాల్లో కూడా ప్రభుత్వ సిబ్బంది షిఫ్టులవారీగా 24 గంటలు విధులను నిర్వహించాలని స్పష్టం చేశారు. రేషన్ సరకులు, తాగునీరు, మందులు, ఇతర వస్తువులును సిద్ధంగా ఉంచాలన్నారు.


