News November 4, 2024
‘పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి’
పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రెండవ రోజు దీక్షలను కొనసాగించారు. ఈ ప్రభుత్వం విద్యా రంగ సమస్యలపై దృష్టి సారించి తక్షణమే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేసి విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 9, 2024
రైతులు అప్రమత్తంగా ఉండాలి: VZM కలెక్టర్
విజయనగరం జిల్లాలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. ప్రస్తుతం ఎవరూ వరి కోతలు చేయొద్దని, ఇప్పటికే కోసిన వారు కుప్పలు పెట్టాలని పేర్కొన్నారు. నూర్చిన ధాన్యం ఉంటే సమీప కొనుగోలు కేంద్రానికి ఇవ్వాలన్నారు. టార్పలిన్ అవసరం ఉన్నవారు పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులను సంప్రదించాలని కోరారు.
News December 7, 2024
విజయనగరం: RTC బస్సు ఢీకొని ఒకరి మృతి
విజయనగరం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. దత్తిరాజేరు మండలం పేదమానాపురంలో సంత జరిగింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వంగరకు చెందిన గెంజి మహేశ్, తిరండి నరసింహారావు, కొలుసు రమణ గొర్రెలతో సంతకు బయల్దేరారు. ఈక్రమంలో పార్వతీపురం నుంచి విజయనగరం వెళ్తున్న RTC బస్సు వీరిని ఢీకొట్టింది. మహేశ్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి.
News December 7, 2024
కంచరపాలెం అమ్మాయి కోసం గొడవ.. అరెస్ట్
విజయనగరానికి చెందిన సాయికుమార్ రెడ్డి(27) కంచరపాలెం యువతితో కలిసి పెదరుషికొండ వద్ద ఓ లాడ్జిలో 10రోజుల నుంచి ఉంటున్నారు. PMపాలేనికి చెందిన పి.వినయ్(23) ఆమెకు కాల్ చేయడంతో గురువారం బయటకు వెళ్లింది. తిరిగి మద్యం మత్తులో లాడ్జికి వచ్చిన యువతిని సాయి ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని ఆమె వినయ్‌కు చెప్పడంతో అతను తన ఫ్రెండ్స్‌తో కలిసి సాయిని దారుణంగా కొట్టారు. బాధితుడి ఫిర్యాదుతో వినయ్‌ను అరెస్ట్ చేశారు.