News March 15, 2025
పార్వతీపురం: ‘మహిళలు, చిన్నారుల రక్షణకు శక్తి టీంలు ఏర్పాటు’

మహిళలు, చిన్నారుల రక్షణకు శక్తి టీంలు ఏర్పాటు చేశామని ఎస్పీ ఎస్. వి మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం శక్తి టీం వాహనాలను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఐదుగురు సభ్యులతో మూడు బృందాలుగా 15మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసామన్నారు. శక్తి యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేకంగా జిల్లాలో శక్తి టీమ్స్ను నియమించామన్నారు.
Similar News
News September 16, 2025
విజయవాడ: వర్షాలకు పంట నష్టం.. ఎస్టిమేషన్స్ రెడీ!

జిల్లాలో గత నెల రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. 1136.98 హెక్టార్లతో పంట నష్టం వాటిల్లింది. ఇందులో మినుము, పెసర, వరి, పత్తి పంటలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్పుట్ రాయితీ రూ.27లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఈ వివరాలు పంపారు. త్వరలో ఇన్పుట్ సబ్సిడీ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News September 16, 2025
శ్రీశైలంలో అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసోత్సవాలు

AP: శ్రీశైల మల్లన్న క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. OCT 24న మొదటి కార్తీక శుక్రవారం కృష్ణమ్మకు నది హారతి, NOV 1న గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం, 5న జ్వాలాతోరణం, ప్రతి సోమవారం లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. శని, అది, సోమ, పౌర్ణమి రోజులలో సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నారు. సాధారణ రోజులలో పరిమితంగా అనుమతిస్తారు.
News September 16, 2025
ADB: మొదలై వెంటనే ముగిసిన ఓ తల్లి విషాద గాథ..!

సిరికొండ మండలం బీంపూర్కు చెందిన తోడసం ఏత్మ భాయి(20) ప్రసవం తర్వాత మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈనెల 12న పురిటి నొప్పులతో ఆమెను ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, బాలుడికి జన్మనిచ్చింది. 14వ తేదీన డిశ్చార్జ్ అయ్యాక తీవ్రమైన తలనొప్పి రావడంతో 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.