News January 31, 2025

పార్వతీపురం: మార్చి 8 వరకు మీ కోసం కార్యక్రమం రద్దు

image

జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్ కోడ్ జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కోడ్ ముగిసినంత వరకు మీకోసం ( ప్రజా సమస్యల పరిష్కార వేదిక ) కార్యక్రమం నిలుపుదల చేయనున్నట్లు కలెక్టర్చ జిల్లా ఎన్నికల అధికారి ఎ. శ్యామ్ ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 8 ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తునట్లు ఆయన స్పష్టం చేశారు.

Similar News

News November 23, 2025

NZB: ఒకే రోజు భార్యాభర్తలు మృతి

image

జీవితాంతం కలిసి బతికిన భార్యాభర్తలు చావును కూడా పంచుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కుల్సాపూర్ తండాకు చెందిన లకావత్ మురుభాయి(90) శనివారం ఉదయం 3 గంటలకు చనిపోయింది. అనారోగ్యంతో ఉన్న ఆమె భర్త తావుర్య ఆమె చావును తట్టుకోలేక నిన్న సాయంత్రం 7గంటలకు మృతిచెందాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకేరోజు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

News November 23, 2025

ASF: కాంగ్రెస్‌లో ఆదివాసీ మహిళకు అగ్రస్థానం

image

ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఆత్రం సుగుణ నియమితులయ్యారు. ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సుగుణ కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమంతో పాటు మానవ హక్కుల వేదిక, ఆదివాసీ మహిళా కార్యకర్తగా ఆమెకు గుర్తింపు. TPCC ఉపాధ్యక్షురాలిగా పని చేస్తూనే, లోక్‌సభ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చారు. ఆమె అంకితభావం, ఆదివాసీ సమాజంలో పలుకుబడి పార్టీకి బలంగా మారుతుందని భావించి బాధ్యతలు కట్టబెట్టారు.

News November 23, 2025

విశాఖలో నాన్‌వెజ్ ధరలు

image

విశాఖపట్నంలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు గణనీయంగా పెరిగాయి. మటన్ కేజీ రూ.950కి, చికెన్ స్కిన్‌లెస్ రూ.280కి, విత్‌స్కిన్ రూ.250కి, శొంఠ్యాం కోడి రూ.300కి పలుకుతోంది. డజన్ గుడ్లు రూ.66కు లభిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే అన్ని రేట్లు భారీగా పెరగడంతో కార్తీక మాసం ముగిసిన వెంటనే ఈ పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది.