News January 31, 2025

పార్వతీపురం: మార్చి 8 వరకు మీ కోసం కార్యక్రమం రద్దు

image

జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్ కోడ్ జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కోడ్ ముగిసినంత వరకు మీకోసం ( ప్రజా సమస్యల పరిష్కార వేదిక ) కార్యక్రమం నిలుపుదల చేయనున్నట్లు కలెక్టర్చ జిల్లా ఎన్నికల అధికారి ఎ. శ్యామ్ ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 8 ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తునట్లు ఆయన స్పష్టం చేశారు.

Similar News

News April 19, 2026

బయోమెట్రిక్ ద్వారానే మొక్క కొనుగోలు: ADB కలెక్టర్

image

మొక్కజొన్న పండించిన రైతులు తమ మొక్క జొన్న పంటని బయటి మార్కెట్‌లో తక్కువ ధరకి అమ్మి నష్టపోకుండా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేలిముద్ర బయోమెట్రిక్ విధానము ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తామన్నారు. కౌలు రైతులు వ్యవసాయ విస్తీర్ణ అధికారి ద్వారా కౌలు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి తమ పంటను సంబందిత కొనుగోలు కేంద్రంలో షెడ్యూల్ ప్రకారం అమ్ముకోవాలన్నారు.

News April 19, 2026

ఆదిలాబాద్‌లో సోమవారం ప్రజావాణి రద్దు

image

జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ వారోత్సవాలు, వివిధ అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వారోత్సవాల నిర్వహణలో అధికార యంత్రాంగమంతా నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

News April 19, 2026

ADB: మొక్కజొన్న కొనుగోలుకు 11 కేంద్రాలు

image

మొక్కజొన్న కొనుగోలుకు ఆదిలాబాద్ జిల్లాలో 11 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పలు కేంద్రాలను ప్రారంభించామని.. మిగతా కొనుగోలు కేంద్రాలు కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. రైతులు తమ పంటను బయటి మార్కెట్లో తక్కువ ధరకు అమ్మి నష్టపోకుండా, తమ మొక్కజొన్న పంటను చెత్తచెదారం లేకుండా తేమ 14% మించకుండా షెడ్యూల్ ప్రకారం కొనుగోలు కేంద్రాలలో అమ్మి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు.