News March 30, 2025
పార్వతీపురం: యువకుడు సూసైడ్

గాజువాకలో శుక్రవారం తెల్లవారుజామున ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. సాలూరుకు చెందిన సతీశ్ కుమార్ అనే యువకుడు విశాఖలోని ఓ ఫార్మా ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి చైతన్య నగర్‌లోని రూంలో స్నేహితుడు రాజశేఖర్‌తో కలిసి నిద్రించాడు. తెల్లవారుజామున ఫ్యాన్ ఆగిపోవడంతో రాజశేఖర్ లేచి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. కేసు నమోదైంది.
Similar News
News April 25, 2025
నిజామాబాద్ జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లా జడ్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జిల్లా న్యాయమూర్తి జి.వి.ఎన్.భరతలక్ష్మిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో ఆమెకు పూల మొక్కను అందించి స్వాగతం తెలిపారు. ఇరువురు కొద్దిసేపు భేటీ అయ్యి జిల్లా స్థితిగతులపై చర్చించారు.
News April 25, 2025
ఏలూరు: ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం అడ్మిషన్స్ ఫ్రీ

ఏలూరు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం అడ్మిషన్స్ ఉచితంగా కల్పిస్తున్నామని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC) అధికారి పంకజ్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి మే 15 లోగా (cse.ap.gov.in) వెబ్ సైట్‌లో అర్హులైన అభ్యర్థులు 1వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు.
News April 25, 2025
కల్వకుర్తి: పాల రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కృష్ణారెడ్డి ఎన్నిక

కల్వకుర్తి మండలం గుండూర్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి పాల రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన రాష్ట్ర సమావేశాల్లో కృష్ణారెడ్డిని నాగర్ కర్నూల్ జిల్లా నుంచి ఎన్నుకున్నారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాల రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.